Top News

Collector | జూలై నెల ప్రత్యేక మహిళా సంఘం చేకూర్పు మాసం : కలెక్టర్

జూలై నెల ప్రత్యేక మహిళా సంఘం చేకూర్పు మాసం : కలెక్టర్ 

20619 మంది లక్ష్యం, ఇంటింటికి వెళ్లి చేర్పించాలి

VLR సదుపాయం, ఆర్థిక చేయూత కోసం సంఘాల్లో చేరిక 

వికలాంగుల, వృద్ధ మహిళా సంఘాల్లోనూ చేర్పులు

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి : 

జిల్లాలో సంఘాల్లో లేకుండా మిగిలిపోయిన ప్రతి పేద మహిళను జూలై 31లోగా మహిళా సంఘాల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ మరియు SERP శాఖ ఆధ్వర్యంలో IDOC సమావేశ హాలులో జిల్లా స్థాయి APM మరియు CC ల సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ SERP CEO గారు జూలై మాసాన్ని ప్రత్యేక మహిళా సంఘం చేకూర్పు మాసంగా ప్రకటించారని తెలిపారు. మహిళా సంఘంలో చేరడం వల్ల పేద మహిళలకు ఆర్థిక చేయూత అందుతుందని, సంఘం ద్వారా జీవనోపాధి కోసం రుణాలు తీసుకుని పేదరికం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెప్పారు. అదేవిధంగా VLR సదుపాయాన్ని కూడా వినియోగించుకోగలుగుతారని పేర్కొన్నారు. ప్రతి మహిళ సంఘంలో చేరి ఆర్థిక సదుపాయం పొందడం వారి హక్కు అని స్పష్టం చేశారు.

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా SHG మహిళలతో పాటు సంఘంలో లేని మహిళలకు కూడా చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో 33102 మందికి చీరలు ఇవ్వగా, అందులో 20619 మందిని మహిళా సంఘాల్లో చేర్పించాలని SERP లక్ష్యంగా విధించిందని, జూలై 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని CC లకు, APM లకు ఆదేశించారు.

మహిళా సంఘాలతో పాటు వికలాంగుల సంఘాలు మరియు వృద్ధుల సంఘాల పనితీరుపై కూడా సమీక్షించారు. జిల్లాలో వికలాంగుల సంఘాలు మరియు వృద్ధుల సంఘాల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని, ఈ నెల ఆఖరు వరకు అర్హులైన ప్రతి దివ్యాంగులను మరియు 60 సంవత్సరాలు దాటిన మహిళలను సంఘాల్లో చేర్పించాలని సిబ్బందిని ఆదేశించారు.

గ్రామ సంఘం, మహిళా సంఘం ప్రతినిధుల సహకారంతో ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన మహిళలను, దివ్యాంగులను సంఘాల్లో చేర్పించే కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి, అదనపు DRDO, DPMలు, APMలు, CCలు, జిల్లా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి పాల్గొన్నారు.




Post a Comment

Previous Post Next Post