Top News

Pipeline Leakage | 816 గ్రామాలకు తాగునీటి సరఫరాపై ప్రభావం

సింగూర్ వద్ద మిషన్ భగీరథ  ప్రధాన పైపు లీక్  

816 గ్రామాలకు తాగునీటి సరఫరాపై ప్రభావం

బాన్సువాడ పట్టణంలో 3 రోజులపాటు సరఫరా నిలిపివేత

మున్సిపల్ బోర్ల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి :

సింగూర్ ప్రాంతంలో మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్‌లో లీకేజీ ఏర్పడింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం మేరేడి గుంట వద్ద జరిగిన ఈ లీకేజీ కారణంగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని 816 గ్రామాలకు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ పుల్కల్ మండలంలోని మేరేడి గుంట ప్రాంతంలో సంభవించింది. దీని ప్రభావంతో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లోని 816 గ్రామాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయింది.

బాన్సువాడ పట్టణానికి నీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ పైపులైన్‌లో లీకేజీ ఏర్పడినందున మరో మూడు రోజుల పాటు మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరాను నిలిపివేయడం జరిగింది.

ఈ మూడు రోజులపాటు పట్టణ ప్రజల త్రాగునీటి అవసరాల కోసం స్థానికంగా ఉన్న మున్సిపాలిటీ బోర్ల ద్వారా నీటిని వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ కోరారు. పైపులైన్ మరమ్మతు పనులు పూర్తయిన వెంటనే యథావిధిగా మంచినీటి సరఫరా పునఃప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.

 (పైప్ లైన్ లీకేజీ, కమిషనర్ వివరణ వీడియో 👇)



Post a Comment

Previous Post Next Post