జల సంరక్షణపై అవగాహన సదస్సు
పిల్లల ద్వారా ఇంటింటికీ నీటి పొదుపు సందేశం
బాన్సువాడ: తెలంగాణ ప్రభుత్వ పరిపాలన, పట్టణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో "జల శక్తి అభియాన్ - జన భాగేదారి" కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ బాన్సువాడ తరపున ఈ కార్యక్రమాన్ని C.U.P.S బాయ్స్ స్కూల్‌లో చేపట్టారు.
ఈ సందర్భంగా కమిషనర్ గోపు గంగాధర్ మాట్లాడుతూ నీటిని పొదుపుగా వాడుకోవాలని పిలుపునిచ్చారు. పిల్లలు పాఠశాలలో నేర్చుకున్న విషయాలను వారి తల్లిదండ్రులకు కూడా తెలియజేసి అవగాహన కల్పించాలని సూచించారు. జల శక్తి అభియాన్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన పెంచాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, స్కూల్ హెడ్మాస్టర్ ఎం. రాణి, 13వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ కాలిక్, కో ఆప్షన్ సభ్యులు సుల్తానా గౌస్, టౌన్ ప్లానింగ్ అధికారి సచిన్, మున్సిపల్ మేనేజర్ మల్లికార్జున్ రెడ్డి, వార్డ్ ఆఫీసర్ రోహిత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



Post a Comment