Death on Railway Track | కామారెడ్డి రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని మృతదేహం

కామారెడ్డి రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని మృతదేహం  

ఆత్మహత్యగా అనుమానం, గుర్తింపు కోసం పోలీసుల విజ్ఞప్తి  

మృతుని ఒంటిపై పచ్చబొట్టు, రాగి కడెం

కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని మగ మృతదేహం లభించిన ఘటన కలకలం రేపింది. శనివారం ఉదయం 5 గంటలకు ముందు కామారెడ్డి నుండి ఉప్పల్వాయి వెళ్లే రైల్వే ట్రాక్ KM no 506/9-10, శివారు రంగంపేట వద్ద ఈ మృతదేహం కనిపించింది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు.

మృతుని వివరాలు  :

మృతుని వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదు. మృతుని తల నుజ్జునుజ్జు కావడంతో గుర్తుపట్టడం కష్టంగా ఉంది. 

మృతుని అంచనా వయసు 35 నుండి 40 సంవత్సరాల మధ్య. చామనచాయ, కోల మొకము. నలుపు రంగు గడ్డం ఉంది.

ప్రత్యేక గుర్తులు  :

కుడి భుజము పై బుల్ గుర్తు పచ్చబొట్టు ఉన్నది  

కుడి చేతికి రాగి కడెం ఉంది  

ఎడమ చెవికి ఇత్తడి పోగు ఉంది  

చేతులపై గతంలో బ్లేడు తో కోసుకున్న గుర్తులు ఉన్నాయి  

మూలాధారం ఉంది

నీలి రంగు అడ్డుగీతల T-shirt, నీలి రంగు నైట్ పాంట్ ధరించాడు. లోపల నలుపు రంగు డ్రాయర్ ఉంది. దానిపై జాకీ పేరు ఎరుపు రంగు పట్టితో ఉంది.

పోలీసుల విజ్ఞప్తి  

మృతుని ఆచూకీ తెలిసిన వారు లేదా మిస్ అయిన వారి గురించి సమాచారం ఉన్నవారు వెంటనే రైల్వే SI కామారెడ్డిని 8712658614 నెంబర్ లో సంప్రదించాలని పోలీసులు కోరారు. 

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post