Top News

Dry Day-Fri Day | పరిసరాల పరిశుభ్రతపై అధికారుల అవగాహన

బాన్సువాడ 13వ వార్డులో 'డ్రై డే - ఫ్రైడే' 

పరిసరాల పరిశుభ్రతపై అధికారుల అవగాహన

తెలంగాణ డైలీ న్యూస్,  బాన్సువాడ: మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు సింధు స్కూల్ వద్ద శుక్రవారం 'డ్రై డే - ఫ్రైడే'  కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి వార్డులో శుక్రవారం రోజున 'ఫ్రైడే ఫ్రైడే' కార్యక్రమం నిర్వహించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దీనివల్ల వ్యాధులు ప్రబలకుండా చూడవచ్చని అన్నారు.(వీడియో 👇)


డెంగ్యూ, సీజనల్ వ్యాధులపై అవగాహన  

13వ వార్డు కౌన్సిలర్ కాలిక్ మాట్లాడుతూ మున్సిపల్ మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందని తెలిపారు. ప్రజలందరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇండ్లలో నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. నీటి నిల్వలు ఉంటే డెంగ్యూ, విష జ్వరాలు, సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కో-ఆప్షన్ సభ్యురాలి భర్త గౌస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ 'డ్రై డే ఫ్రైడే' నిర్వహించి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, కో-ఆప్షన్ సభ్యులు కమర్ సుల్తానా, గౌస్, సింధు స్కూల్ కరస్పాండెంట్ జ్ఞానేశ్వర్, అనిల్, కాలనీ పెద్దలు, మెడికల్ పవన్, ఏ వన్ ఫుట్వేర్ ఖదీర్ భాయ్,కిషోర్, అజ్మత్ తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

Previous Post Next Post