సదాశివనగర్ బీసీ బాలుర వసతిగృహంలో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం
వార్డెన్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
బాన్సువాడ ఘటన తర్వాత మరో ఘటనతో ఆందోళన
తెలంగాణ డైలీ న్యూస్, సదాశివనగర్: ఎల్లారెడ్డి సెగ్మెంట్ సదాశివనగర్‌లోని బీసీ బాలుర వసతిగృహంలో 10వ తరగతి విద్యార్థి గురువారం అర్ధరాత్రి ఆత్మహత్యకు యత్నించాడు. బాన్సువాడ ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య ఘటన మరవక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.
ఘటన వివరాలు
వసతిగృహంలో ఉంటున్న విద్యార్థి రబ్బర్ బ్యాండ్‌తో మెడకు చుట్టుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన వార్డెన్ వెంటనే స్పందించి అడ్డుకున్నారు. వెంటనే కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది.
గాంధారి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఈ విద్యార్థి హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక, ఒంటరితనం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ఈ ఘటనతో హాస్టళ్లలో విద్యార్థుల భద్రత, కౌన్సెలింగ్ పై మరోసారి చర్చ మొదలైంది.

Post a Comment