Top News

Jukkal MLA Meets Azharuddin | మంత్రి అజరుద్దీన్ ను కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు

 

మంత్రి అజరుద్దీన్ ను కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు 

మైనారిటీ సంక్షేమ పథకాల సమర్థ అమలుపై చర్చ

విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యత

ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చర్యలు 

సానుకూలంగా స్పందించిన మంత్రి అజారుద్దీన్

తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్ :

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమం మరియు ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి  మహమ్మద్ అజారుద్దీన్ ని జుక్కల్ ఎమ్మెల్యే  తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు  ఏలే మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గంలోని మైనారిటీ సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారు మంత్రితో చర్చించారు.

ఈ సందర్భంగా నాయకులు కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గంలోని మైనారిటీ ప్రజల సంక్షేమం, విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలు వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మైనారిటీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మంత్రి  మహమ్మద్ అజారుద్దీన్, నాయకులు ప్రస్తావించిన అంశాలను సానుకూలంగా స్వీకరించారు. ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సానుకూల వాతావరణంలో సాగిన ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా  జుక్కల్ నియోజకవర్గ మైనారిటీ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలనే ఆకాంక్షను నాయకులు వ్యక్తం చేశారు.




Post a Comment

Previous Post Next Post