KTR: రాష్ట్రంలో రైతు, విద్యుత్, పరిపాలన వైఫల్యాలు

పరిపాలన వైఫల్యాలపై ప్రభుత్వంపై విమర్శలు

ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయలేదు 

ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వానికి ఓట్లతో బుద్ధి చెప్పాలి 

రాష్ట్రంలోని ప్రధాన అంశాలపై కేటీఆర్ వ్యాఖ్యలు

బీఆరెస్ లో చేరిన మోరీల్ శ్రీనివాస్ రావు 

తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్ : 

కేటీఆర్ సమక్షంలో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పారిశ్రమిక వేత్త  శ్రీనివాస్ రావు, పలువురు నాయకులు తెలంగాణ భవన్‌లో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రైతులకు ఎరువులు, విత్తనాలు, యూరియా సకాలంలో అందుబాటులో ఉండేవి, ఆటోకు ఒక్క ఫోన్ చేస్తే యూరియా పొలం దగ్గరకు వచ్చేది, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో యాప్ విధానం తీసుకురావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.ధాన్యం నింపేందుకు సంచులు కూడా లేని పరిస్థితి ఉందని, కరెంట్ సరిగా ఇవ్వడం లేదని మండిపడ్డారు.ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయలేదనివిమర్శించారు. గత ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే అభివృద్ధి పనులు జరిగాయని, కానీ కొత్తగా ఏమీ చేయలేదన్నారు.ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి మాటలు చెప్పడానికే పరిమితమయ్యారని, రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టడం లేదని అన్నారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ఆరోపించారు.ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వానికి ఓట్లతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలు మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. గతంలో బాన్సువాడలో గులాబీ జెండా ఎగరవేశాం. పెద్దాయన పోచారంను గెలిపిస్తే పోయి పోయి మునిగిపోయే పడవ కాంగ్రెస్ పార్టీలో చేరారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, ఒక చిచ్చోరాగాడు అని, ఖర్గే ని మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేలా చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.


- ఢిల్లీకి మాటలు మోసుడే రేవంత్‌కు సరిపోతుందన్నారు. దోచుకున్నది రాహుల్‌కు అప్పజెప్పాలి. రెండున్నరేళ్లలో ఆయన చేసింది ఏమీ లేదు. మైక్ దొరికితే చాలు కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు.

- కేసీఆర్ పాలనలో రైతులు సల్ల కదలకుండా పనులు అయ్యేవి. ఎరువులు, విత్తనాలు, యూరియా అన్నీ అందుబాటులో ఉండేవి. ఆటోకు ఒక్క ఫోన్ చేస్తే నాడు యూరియా పొలం కాడికి వచ్చేది.

- కాంగ్రెస్ పాలనలో యాప్‌లో తీసుకొచ్చి రైతులను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. కరెంట్ సరిగా లేదు. ధాన్యం నింపేందుకు సంచులు కూడా లేవు.

- రుణమాఫీ చేయని ఆ పార్టీకి ఓట్లతో బుద్ధి చెప్పాలన్నారు. మళ్లీ బాన్సువాడలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని, అది చూసి కాంగ్రెస్ పార్టీకి కర్ర కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్ది, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ షిండే, విజి గౌడ్, జీవన్ రెడ్డి నాయకులు నార్ల రత్న కుమార్, అంజిరెడ్డి, జుబేర్ తదితరులు పాల్గొన్నారు.







Post a Comment

Previous Post Next Post