RTC BMS Union | టి.ఎస్.ఆర్.టి.సి బాన్సువాడ డిపోలో బిఎంఎస్ నూతన కమిటీ ఎన్నిక


టి.ఎస్.ఆర్.టి.సి బాన్సువాడ డిపోలో బిఎంఎస్ నూతన కమిటీ ఎన్నిక

ధర్మ పాల్ అధ్యక్షులుగా, మారుతి కార్యదర్శిగా ఎన్నిక

బాన్సువాడ: ఈరోజు టి.ఎస్.ఆర్.టి.సి బాన్సువాడ డిపోలో భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో బిఎంఎస్ నూతన కమిటీని ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షులుగా ధర్మ పాల్, కార్యదర్శిగా మారుతి, కోశాధికారిగా సబ్డీ హనుమాన్లు ఎన్నికయ్యారు. మహిళా బిఎంఎస్ అధ్యక్షురాలుగా పి. మంజుల, కార్యదర్శిగా పి. విజయ గార్లను ఎన్నుకొని ప్రమాణ స్వీకారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా మజ్దూర్ సంఘ్ ఉపాధ్యక్షులు గౌరవనీయులు వెంకట్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం బాన్సువాడ డిపో డి.ఎం. రవికుమార్ గారితో పరిచయ వేదిక కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ డిపో బిఎంఎస్ కార్యకర్తలు, మాజీ అధ్యక్షులు గురుడు అంబాజీ, గోపికృష్ణ, శివకుమార్, శివరతన్, వెంకట్రాంరెడ్డి, అంజయ్య, ఎస్. హనుమాన్లు, వినోద్ కుమార్, కృష్ణమోహన్, వసంత్ కుమార్, ఎడిసి నాగరాజ్ తో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post