Top News

MLA PSR Review | సిద్దాపూర్ రిజర్వాయర్ పనులపై పోచారం సమీక్ష

 

సిద్దాపూర్ రిజర్వాయర్ పనులపై పోచారం సమీక్ష  

భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశం  

55.30 కోట్ల నిధులు మంజూరు  

నాణ్యతతో త్వరితంగా పూర్తి చేయాలని సూచన

తెలంగాణ డైలీ న్యూస్,హైదరాబాద్: పబ్లిక్ గార్డెన్స్ లోని కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై ఇరిగేషన్, అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

నిధులు మంజూరు వివరాలు  

గత నెల 23 మే 2026న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముంపు ప్రభావిత భూములకు నష్టపరిహారం చెల్లించి అవసరమైన అనుమతులు పొందేందుకు రూ. 55.30 కోట్లను మంజూరు చేశారు. ఈ మేరకు 08 జూన్ 2026న జి.ఓ. నం. 37 ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఈ సమావేశంలో అటవీ శాఖ నోడల్ ఆఫీసర్ పిసిఎఫ్ శ్రావణ్, ఇరిగేషన్ ఈఎన్సీ శ్రీనివాస్, కామారెడ్డి ఇంచార్జి సిఈ దక్షిణామూర్తి, బాన్సువాడ ఈఈ రాజశేఖర్ పాల్గొన్నారు. ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగే అంశాలపై చర్చించారు. (అధికారులతో సమీక్ష వీడియో 👇)



భూసేకరణపై ప్రత్యేక దృష్టి  

పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంత రైతులకు వెంటనే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పనుల పూర్తిపై ఆదేశాలు  

ప్రతి దశను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. నిర్మాణంలో నాణ్యత లోపం ఉండకూడదని, నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.




Post a Comment

Previous Post Next Post