ప్రతి గురువారం వికలాంగులకు పరీక్షలు
తగ్గిన దూర భారం
బాన్సువాడ : బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సదరం సేవలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. ఈనెల 12న రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజక వర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సేవలను ప్రారంభించగా, ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డిసిబి ఛైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరైన విషయం విదితమే. ఇక్కడ సేవలు ప్రారంభం కావడంతో బాన్సువాడ, బీర్కూర్, నసురులాబాద్, నిజాంసాగర్, పిట్లం, జుక్కల్, మద్నూర్, బిచ్కుంద తదితర మండలాల వికలాంగులకు సౌలభ్యం ఏర్పడింది. లేని పక్షం లో వ్యయప్రయాసలు కోర్చి నిజామాబాద్, కామారెడ్డి కి వెళ్లాల్సి వచ్చేది.
సదరం సేవల వివరాలు
ఆర్ఎంఓ సుజాత మాట్లాడుతూ వికలాంగులు మీ సేవలో స్లాట్ బుకింగ్ చేసుకుని రావాలని తెలిపారు. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వికలాంగులకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఏర్పాటు ఉద్దేశం
13 వార్డ్ కౌన్సిలర్ మొహమ్మద్ ఖాలేఖ్, కో ఆప్షన్ సభ్యురాలు సుల్తానా గౌస్ మాట్లాడుతూ దూరంగా ఉన్న జిల్లా కేంద్రానికి వెళ్లలేక వికలాంగులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో సదరం కేంద్రం ఏర్పాటుకు కృషి చేశారని అన్నారు. దీనితో వికలాంగులకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్, ఆర్ఎంఓ సుజాత, 13 వార్డ్ కౌన్సిలర్ మొహమ్మద్ ఖాలేఖ్, మొహమ్మద్ సుల్తానా గౌస్, కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ ఇలియాస్ అలీ, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.



Post a Comment