Top News

SP's Training | జిల్లా స్థాయి రైటర్లకు ఆధునిక సాఫ్ట్‌వేర్‌లపై అవగాహన

జిల్లా స్థాయి రైటర్లకు ఆధునిక సాఫ్ట్‌వేర్‌లపై అవగాహన  

కేసుల విచారణలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి  

బాధితులకు వేగంగా, పారదర్శకంగా సేవలు  

సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసు సేవల మెరుగుదల

సీసీటీఎన్ఎస్-2.0 శిక్షణ

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పాల్గొని రైటర్లకు దిశానిర్దేశం 

కామారెడ్డి: జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల రైటర్లు, సిఐ కార్యాలయాలు, డిఎస్పి కార్యాలయాల రైటర్లకు సీసీటీఎన్ఎస్-2.0  ఇతర ఆధునిక పోలీసింగ్ సాఫ్ట్‌వేర్‌లపై జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఈరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పాల్గొని రైటర్లకు దిశానిర్దేశం చేశారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి వేగంగా, పారదర్శకంగా, నాణ్యమైన సేవలు అందించడం ప్రతి పోలీసు అధికారి బాధ్యత అని ఎస్పీ తెలిపారు. బాధితుల సమస్యల పరిష్కారంలో రైటర్ల పాత్ర కీలకమని, అందరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

కేసుల విచారణపై సూచనలు  

కేసుల దర్యాప్తు, విచారణ, పరిశోధనలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు నుండి చార్జ్‌షీట్ దాఖలు వరకు ప్రతి వివరాన్ని సమగ్రంగా నమోదు చేయాలని పేర్కొన్నారు. సాక్షులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు కేసుల విచారణలో కీలకమని, అసంపూర్ణ సమాచారం కేసులపై ప్రభావం చూపుతుందని అన్నారు.

ఆధునిక సాంకేతికత వినియోగం  

సీసీటీఎన్ఎస్-2.0, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, టిఎస్-కాప్, హెచ్ఆర్ఎంఎస్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్, సిఇఐఆర్, సైబర్ క్రైమ్ పోర్టల్, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ వంటి అప్లికేషన్లపై పూర్తి అవగాహనతో పని చేయాలని సిబ్బందికి సూచించారు. సీసీటీఎన్ఎస్-2.0ను సమర్థంగా వాడటం ద్వారా పోలీసు సేవలు వేగంగా, పారదర్శకంగా ప్రజలకు చేరుతాయని తెలిపారు.

"బాధితుడికి సమయానికి న్యాయం లభిస్తేనే చట్టంపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసాన్ని నిలబెట్టడం ప్రతి పోలీసు అధికారికి ఉన్న అత్యంత ముఖ్యమైన బాధ్యత" అని ఎస్పీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో కామారెడ్డి రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఇతర పోలీసు అధికారులు, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ రైటర్లు, సిఐ మరియు డిఎస్పి కార్యాలయాల రైటర్లు పాల్గొన్నారు.




Post a Comment

Previous Post Next Post