Top News

Padma Devendar Reddy |ఉపాధి కోల్పోయిన బీఆర్ఎస్ కార్యకర్తకు అండగా నిలిచిన పద్మా దేవేందర్ రెడ్డి

ఉపాధి కోల్పోయిన బీఆర్ఎస్ కార్యకర్తకు అండగా నిలిచిన పద్మా దేవేందర్ రెడ్డి

పార్టీ కోసం పనిచేసే వారికి అండగా ఉంటాం: హరీశ్ రావు  

తెలంగాణ డైలీ న్యూస్ బ్యూరో, మెదక్ :

మెదక్: మున్సిపల్ ఎన్నికల సమయంలో దుండగుల దాడిలో ఆటోను కోల్పోయి జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్న బీఆర్ఎస్ కార్యకర్త హబీబ్‌కు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అండగా నిలిచారు.

మెదక్ మున్సిపల్ ఎన్నికల వేళ దుండగులు హబీబ్ ఆటోను దగ్ధం చేయడంతో ఆయన ఉపాధి కోల్పోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పద్మా దేవేందర్ రెడ్డి స్వయంగా స్పందించి హబీబ్‌కు కొత్త ఆటోను కొనుగోలు చేశారు. ఇన్సూరెన్స్‌తో పాటు అన్ని వాహన పత్రాలను కూడా పూర్తి చేయించారు. దీంతో హబీబ్‌కు తిరిగి జీవనోపాధి లభించింది.

వాహన పత్రాలు అందజేత  

గురువారం మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నివాసంలో జరిగిన కార్యక్రమంలో హబీబ్‌కు ఆటో వాహన పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

పార్టీ కోసం పనిచేసే వారికి అండగా ఉంటాం: హరీశ్ రావు  

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు కష్టకాలంలో అండగా నిలవడం తమ బాధ్యత అన్నారు. ఎన్నికల సమయంలో ఆటో దగ్ధమై జీవనోపాధి కోల్పోయిన హబీబ్‌కు మళ్లీ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పద్మా దేవేందర్ రెడ్డి ఆటోను కొనుగోలు చేసి అందించారని తెలిపారు.

తనకు ఆటోను అందించి జీవనోపాధిని పునరుద్ధరించిన పద్మా దేవేందర్ రెడ్డి, హరీశ్ రావుతో పాటు పార్టీ నాయకత్వానికి హబీబ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ కన్వీనర్ గడ్డమీద కృష్ణగౌడ్, యువ నాయకుడు జీవన్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, మున్సిపల్ కౌన్సిలర్లు బట్టి ఉదయ్ కుమార్, జుబేర్ అహ్మద్, దీపక్ కుమార్, మాజీ కౌన్సిలర్ మాయ మల్లేశం, నాయకులు సాయి, కసాపురం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post