Top News

Pocham Srinivas Reddy and Bhaskar Reddy pay tributes | బోర్లం గ్రామంలో నగేష్ రెడ్డి అంత్యక్రియలు

బోర్లం గ్రామంలో నగేష్ రెడ్డి అంత్యక్రియలు  

పోచారం శ్రీనివాసరెడ్డి, భాస్కర్ రెడ్డి పాల్గొని నివాళులు  

కుటుంబానికి ప్రగాఢ సానుభూతి

బాన్సువాడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు  పోచారం శ్రీనివాసరెడ్డి , మాజీ డిసిసిబి చైర్మన్  పోచారం భాస్కర్ రెడ్డి బోర్లం గ్రామంలో జరిగిన నగేష్ రెడ్డి  అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

తన వ్యక్తిగత సహాయకులు సురేందర్ రెడ్డి  సోదరుడైన నగేష్ రెడ్డి  కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 21 జూలై 2026 మంగళవారం రాత్రి 11:45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.

ఈరోజు బోర్లం గ్రామంలో జరిగిన అంత్యక్రియలకు హాజరైన పోచారం శ్రీనివాసరెడ్డి, నగేష్ రెడ్డి  పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి కి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు.






Post a Comment

Previous Post Next Post