Top News

Police Raid | గాంధారి పోలీసుల దాడి - జూదం ఆడుతున్న 11 మంది పట్టివేత

 


గాంధారి పోలీసుల దాడి - జూదం ఆడుతున్న 11 మంది పట్టివేత  

రూ.6,160 నగదు, 6 మొబైల్ ఫోన్లు, 7 మోటార్‌సైకిళ్లు స్వాధీనం

కామారెడ్డి: జిల్లాలో జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలోని డంప్ యార్డ్ వద్ద జూదం ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు గాంధారి ఎస్‌ఐ మహేందర్ తమ సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు.

ఈ దాడిలో జూదం ఆడుతున్న 11 మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ.6,160 నగదు, 6 మొబైల్ ఫోన్లు, 7 మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జిల్లా ఎస్పీ హెచ్చరిక  

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ జూదానికి అలవాటు పడితే వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. క్షణిక లాభాల కోసం జీవితాన్ని పణంగా పెట్టవద్దని, యువత జూదానికి దూరంగా ఉండి కష్టపడి చదివి పనిచేసి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. చట్టవిరుద్ధంగా జూదం నిర్వహించినా ఆడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

జిల్లాలో ఎక్కడైనా జూదం లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Post a Comment

Previous Post Next Post