PSR Visit to NIMS | నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాన్సువాడ బాలింతలను పరామర్శించిన పోచారం

నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాన్సువాడ బాలింతలను పరామర్శించిన పోచారం 

ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం 30 వేల రూపాయల ఆర్థిక సహాయం

హైదరాబాద్: బాన్సువాడలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో గత కొన్ని రోజుల క్రితం ఐదుగురు బాలింతలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొదట వారిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ నుండి మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ఈరోజు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసన సభ్యులు  పోచారం శ్రీనివాసరెడ్డి  పరామర్శించారు. హుమెరా ఫాతిమా - ఎల్లారెడ్డి, రుక్సనా - కొత్తబాది, బాన్సువాడ మండలం, జ్యోతి - గౌరారం, గాంధారి మండలం  లను పరామర్శించారు.

నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డా. రాహుల్ దేవరాజ్ తో మాట్లాడిన పోచారం, బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. హుమెరా ఫాతిమా, జ్యోతి  ఆరోగ్యం నిలకడగా ఉందని, రుక్సనాకు డయాలసిస్ జరుగుతుందని డైరెక్టర్  తెలిపారు.

ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న ముగ్గురి కుటుంబాలకు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున మొత్తం 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పోచారం శ్రీనివాసరెడ్డి అందజేశారు.







Post a Comment

Previous Post Next Post