గురువారం నుండి 6 రోజుల పాటు నిర్వహణ
DM&HO డా. వెంకట్
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలో ఇంటింటి ఆరోగ్య సర్వేను త్వరలో నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. వెంకట్ తెలిపారు.
బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో సర్వే సిబ్బందితో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన DM&HO డా. వెంకట్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు గురువారం నుండి ఆరు రోజుల పాటు బాన్సువాడ పట్టణంలో ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహిస్తామని వెల్లడించారు.
ఈ సర్వేలో ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను సేకరించి నమోదు చేస్తారని తెలిపారు. సర్వే సిబ్బంది అడిగే సమాచారంతో పాటు ఆధార్ కార్డును అందించాలని ప్రజలను కోరారు.
దీని ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు అభకార్డులో నమోదు అవుతాయని, భవిష్యత్తులో ఆరోగ్య సేవలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని DM&HO అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. విజయ్ భాస్కర్ తో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment