Top News

Response on Dial 100 | 10 నిమిషాల్లో రైల్వే ట్రాక్‌పై వ్యక్తిని రక్షించి ప్రాణాలు కాపాడిన పోలీసు బృందం

డయల్-100 సమాచారంతో మెరుపు వేగంతో స్పందించిన కామారెడ్డి పోలీసులు

10 నిమిషాల్లో రైల్వే ట్రాక్‌పై వ్యక్తిని రక్షించి ప్రాణాలు కాపాడిన పోలీసు బృందం

కామారెడ్డి: ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో చెప్పి వెళ్లిపోయిన ఓ వ్యక్తిని కామారెడ్డి పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి సురక్షితంగా రక్షించారు.

నిన్న రాత్రి ఆ వ్యక్తి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే డయల్-100కు సమాచారం అందించారు. సమాచారం అందగానే కామారెడ్డి పోలీసు సిబ్బంది ఆలస్యం చేయకుండా గాలింపు చర్యలు ప్రారంభించారు.

బీసీ కానిస్టేబుల్ అరుణ్ నేతృత్వంలోని పోలీసు బృందం అందిన సమాచారాన్ని విశ్లేషిస్తూ కేవలం 10 నిమిషాల్లోనే రైల్వే ట్రాక్‌పై ఉన్న వ్యక్తిని గుర్తించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకముందే అతడిని అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల తక్షణ స్పందనతో ఒక విలువైన ప్రాణం నిలిచింది.

ఎస్పీ రాజేష్ చంద్ర విజ్ఞప్తి

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ, "ప్రతి ప్రాణం అమూల్యమైనది. సమస్య ఏదైనా ఆత్మహత్య పరిష్కారం కాదు. ఆపదలో ఉన్నవారు వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పోలీసులను సంప్రదించాలి. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100కు సమాచారం అందిస్తే పోలీసులు వెంటనే స్పందిస్తారు" అని తెలిపారు.

మానసిక ఒత్తిడి లేదా నిరాశతో బాధపడుతున్న వారు ఒంటరిగా ఉండకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం పొందాలని జిల్లా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Post a Comment

Previous Post Next Post