Top News

Rice Millers Must Pay | రబీ 2022-23 వరి వేలం బకాయిలపై అదనపు కలెక్టర్ సమీక్ష

రబీ 2022-23 వరి వేలం బకాయిలపై అదనపు కలెక్టర్ సమీక్ష  

బకాయిలు వెంటనే ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని రైస్ మిల్లర్లకు ఆదేశం  

గడువులోగా చెల్లించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక  

ప్రభుత్వ ఆదాయ పరిరక్షణలో రాజీ లేదు  

కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:  

రబీ మార్కెటింగ్ సీజన్ 2022-23కు సంబంధించిన వేలం ద్వారా విక్రయించిన వరి బకాయిల చెల్లింపులపై అదనపు కలెక్టర్ సివిల్ సప్లైస్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు.  

ఈ సమావేశానికి హెడ్ ఆఫీస్, హైదరాబాద్‌కు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ OSD, జిల్లా పౌర సరఫరాల అధికారి DCSO, జిల్లా మేనేజర్, తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ DM, TGSCSC, సంబంధిత రైస్ మిల్లర్ల ప్రతినిధులు హాజరయ్యారు.  

సమావేశంలో వేలం ద్వారా వరిని పొందిన రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి చెల్లించవలసిన బకాయిల స్థితిని సమీక్షించారు. బకాయి మొత్తాలను వెంటనే ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని సంబంధిత రైస్ మిల్లర్లను ఆదేశించారు.  

నిర్దేశించిన గడువులోగా బకాయిలు చెల్లించని పక్షంలో నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. ప్రభుత్వ ఆదాయాన్ని పరిరక్షించే విషయంలో ఎటువంటి రాజీ ఉండదని, సంబంధిత మిల్లర్లు వెంటనే బకాయిలను చెల్లించాలని సూచించారు.



Post a Comment

Previous Post Next Post