Top News

SIR In 14th Ward | ఓటరు నమోదు ప్రాధాన్యతపై అవగాహన

బాన్సువాడ 14వ వార్డులో SIR కార్యక్రమం  

కాంగ్రెస్ నాయకుల భాగస్వామ్యం  

ఓటరు నమోదు ప్రాధాన్యతపై అవగాహన

బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని 14వ వార్డులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ SIR కార్యక్రమం శనివారం నిర్వహించారు. స్థానిక వార్డు కౌన్సిలర్ నార్ల వసంత నందకిషోర్ తో కలిసి షాదీఖానా చైర్మన్ అబ్దుల్ వహబ్, కాంగ్రెస్ పట్టణ మైనారిటీ సెక్రెటరీ యండి. దావూద్, కాజీమ్, యూత్త్  కాంగ్రెస్ అధ్యక్షులు మన్సూర్ ఎన్యూమరేషన్ ఫారముల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.Video 👇


ఓటరు నమోదుపై అవగాహన  

ఈ సందర్భంగా నాయకులు వార్డు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాల ప్రాధాన్యతను వివరించారు. ప్రతి అర్హులైన ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు.

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఓటరు నమోదు, వివరాల సవరణ కీలక పాత్ర పోషిస్తాయని వారు పేర్కొన్నారు. ప్రజలు అధికారులకు సహకరించి, అవసరమైన వివరాలను సకాలంలో అందించి ఓటరు జాబితాను సరిదిద్దుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బియల్వోలు ఆఫియ తరన్నుమ్, నసీమ, బూత్ ఏజెంట్ అలీ తదితరులు పాల్గొన్నారు.





Post a Comment

Previous Post Next Post