కామారెడ్డిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ఏర్పాట్లు
త్రివర్ణ లైట్లతో వెలుగు జిమ్ముతున్న కలెక్టరేట్
ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు వీ హెచ్ రాక
ఇందిరా గాంధీ స్టేడియంలో ఉదయం 9:30 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ
కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆగస్టు 15న కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఉదయం 9:30 గంటలకు జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ & అభివృద్ధి సలహాదారులు వి. హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని కలెక్టర్ వెల్లడించారు.
![]() |
| Greetings |
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సాధించిన పురోగతిని సమగ్రంగా తెలిపేలా ముఖ్య అతిథి ప్రసంగ నివేదికను తయారు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రజలకు కలెక్టర్ పిలుపు
ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర్య సమరయోధులు, అధికారులు, విద్యార్థులు, యువత మరియు జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు.










Post a Comment