కామారెడ్డిలో నాటుసారా ముడిసరుకు భారీ పట్టివేత
220 కిలోల నల్ల బెల్లం, 64 కిలోల పటిక, 2 కార్లు స్వాధీనం - ఇద్దరు అరెస్ట్
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి బి. ముకుందరెడ్డి గారి ఆదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది నిర్వహించిన తనిఖీల్లో నాటుసారా తయారీకి ఉపయోగించే ముడిసరుకు భారీగా పట్టుబడింది.
కామారెడ్డి నుండి సిరిసిల్ల వెళ్లే రోడ్డులో అనుమానాస్పదంగా ఉన్న కారును ఆపి తనిఖీ చేయగా 60 కిలోల నల్ల బెల్లం, 10 కిలోల పటిక లభించింది. ఈ క్రమంలో వార్నెపల్లి గ్రామానికి చెందిన నిందితుడు భూక్య గంగును అరెస్ట్ చేసి, అతను నడుపుతున్న AP 28 CD 3397 వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అతడు ఇచ్చిన సమాచారం మేరకు కామారెడ్డి గంజ్ లోని కృష్ణకుమార్ మార్చంట్ వద్ద సోదాలు నిర్వహించారు. అక్కడ 160 కిలోల నల్ల బెల్లం, 64 లీటర్ల పటికను స్వాధీనం చేసుకుని మరో నిందితుడిని అరెస్ట్ చేశారు.
మొత్తం స్వాధీనం:
నల్ల బెల్లం: 220 కిలోలు
పటిక: 64 కిలోలు
వాహనాలు: 2 కార్లు
అరెస్టులు: 2 మంది
ఈ సందర్భంగా ఎక్సైజ్ జిల్లా అధికారి ముకుంద రెడ్డి మాట్లాడుతూ నాటుసారా, దాని తయారీకి ఉపయోగించే ముడిసరుకులను విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ దాడుల్లో ఎక్సైజ్ సిఐ సంపత్ కృష్ణ, ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్, కానిస్టేబుల్స్ గౌరి, మహేష్, రాజు, బాబు, శరత్ చందర్ పాల్గొన్నారు.

Post a Comment