అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా చూడాలి
తాడ్కోల్ లో గ్రామ సభకు హాజరైన ఆర్డీఓ రవీందర్ రెడ్డి
బాన్సువాడ, ఆగస్టు 27: బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభకు ఆర్డీఓ రవీందర్ రెడ్డి హాజరయ్యారు.
తాడ్కోల్ గ్రామ పరిధిలోని పోలింగ్ స్టేషన్ నంబర్లు 245, 246, 247, 250 మరియు 251 లకు సంబంధించి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) లో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు.
ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీఓ రవీందర్ రెడ్డి ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముసాయిదా జాబితాను చదివి వినిపించి, మరణించిన వారు, వలస వెళ్లిన వారు, డబుల్ ఎంట్రీల గుర్తింపులో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.
అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా చూడాలని, తప్పుల సవరణకు వెంటనే బీఎల్ఓ లను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, బీఎల్ఓలు, ఉప సర్పంచ్ షేక్ సాజిద్,పంచాయతీ కార్యదర్శి, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Post a Comment