Top News

Hotels Inspection | కామారెడ్డిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

కామారెడ్డిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు - న్యూ బస్ స్టాండ్ వద్ద హోటళ్ల తనిఖీ

నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు - పలు హోటళ్లకు నోటీసులు జారీ

కామారెడ్డి, ఆగస్టు 31: కామారెడ్డి పట్టణంలోని న్యూ బస్ స్టాండ్ పరిసరాల్లో ఉన్న పలు హోటళ్లు, రెస్టారెంట్లను ఆహార భద్రతాధికారి జి. విక్రమ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

హోటళ్ల వంటశాలల పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ, తయారీ విధానం, వినియోగిస్తున్న పరికరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

తనిఖీల్లో పలు హోటళ్ల వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నట్లు, కొన్ని చోట్ల స్టెయిన్‌లెస్ స్టీల్ కత్తులకు బదులుగా ఇనుప కత్తులను వినియోగిస్తున్నట్లు గుర్తించామని అధికారి తెలిపారు.

నిబంధనలు పాటించని యజమానులకు మెరుగుదల నోటీసులు జారీ చేసి, లోపాలను నిర్ణీత గడువులోగా సరిదిద్దాలని ఆదేశించామన్నారు. లేనిపక్షంలో ఆహార భద్రతా నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించేందుకు నిరంతరం తనిఖీలు కొనసాగిస్తామని ఫుడ్ సేఫ్టీ అధికారి జి. విక్రమ్ తెలిపారు.



Post a Comment

Previous Post Next Post