Top News

Raksha Bandhan | రాఖీ వేడుకల్లో ఎమ్మెల్యేలు

పోచారం శ్రీనివాస్ రెడ్డికి రాఖీ కట్టిన అక్క సత్యవతి

జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు, మహిళా సంఘాలు

బాన్సువాడ, జుక్కల్ - ఆగస్టు 28: రాఖీ పౌర్ణమి వేడుకలు బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో ఘనంగా జరిగాయి.

బాన్సువాడలో:తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఆయన అక్క దొడ్ల సత్యవతి శుక్రవారం తన నివాసంలో రాఖీ కట్టి ఆశీర్వదించారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను ఆనందంగా జరుపుకోవాలని, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు అని పోచారం తెలిపారు.

జుక్కల్ లో:ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు రాజయోగిని బ్రహ్మకుమారి స్వప్న, బీడీ కార్మికులు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు, చిన్నారులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. తనకు రాఖీ

 కట్టిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపి, అన్నా చెల్లెళ్ల ప్రేమానుబంధం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.






Post a Comment

Previous Post Next Post