Top News

Raksha Bandhan |షబ్బీర్ అలీకి రాఖీ కట్టిన రామ నరేందర్ చౌదరి

 


మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నా చెల్లెళ్ల అనుబంధం - -షబ్బీర్ అలీకి రాఖీ కట్టిన రామ నరేందర్ చౌదరి

గంప గోవర్ధన్ కు రాఖీ కట్టిన అక్కలు

హైదరాబాద్, ఆగస్టు 28 : రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కు ఆయన ఆత్మీయ సోదరి రామ నరేందర్ చౌదరి శుక్రవారం ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసంలో రాఖీ కట్టారు.

గత మూడు దశాబ్దాలుగా ప్రతి రాఖీ పండుగకు రామ నరేందర్ చౌదరి షబ్బీర్ అలీకి రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆమె షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా గడిపారు. మతాలకు అతీతమైన తమ అనుబంధం అందరికీ ఆదర్శమని షబ్బీర్ అలీ తెలిపారు.

గంప గోవర్ధన్ కు రాఖీ కట్టిన అక్కలు

హైదరాబాద్: రాఖీ పౌర్ణమి వేడుకలను కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయనకు అక్కలు సుగుణ, ప్రమీల, విమల రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని పంచుకుంటూ ఆనందంగా వేడుక జరుపుకున్నారు.




Post a Comment

Previous Post Next Post