ఇబ్రహీంపేట పాఠశాలలో పెన్షన్ విద్రోహ దినం
నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపిన ఉపాధ్యాయులు
CPS రద్దు చేసి OPS అమలు చేయాలని డిమాండ్
బాన్సువాడ (ఇబ్రహీంపేట):
ఎంపీపీఎస్ ఇబ్రహీంపేట పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో సెప్టెంబర్ 1ని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా SGT యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యాల సంతోష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే CPS విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.
ప్రభుత్వం వెంటనే 6 DAలను ప్రకటించాలని, PRCని తక్షణమే అమలు చేయాలని, CPSను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రాథమిక పాఠశాలల్లో SA-1, SA-2 పరీక్షల్లో బాహ్య మూల్యాంకనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో PSHM లు రమేష్, గంగా జమున, ఉపాధ్యాయులు శ్రీకాంత్ రెడ్డి, విజయ్ కుమార్, రంగమ్మ, రాజు, సాయి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

Post a Comment