Top News

Appreciate to PRESS CLUB | జర్నలిస్టులకు హెల్త్ కార్డు, పిల్లలకు 75% ఫీజు రాయితీ - ప్రెస్ క్లబ్ కృషి అభినందనీయం

జర్నలిస్టులకు హెల్త్ కార్డు, పిల్లలకు 75% ఫీజు రాయితీ - ప్రెస్ క్లబ్ కృషి అభినందనీయం

జర్నలిస్టుల పిల్లలకు 75% ఫీజు రాయితీ ఉత్తర్వులు జారీ - ప్రెస్ క్లబ్ కు కృతజ్ఞతలు - ఎం.ఏ.మాజీద్

నిజామాబాద్: నిజామాబాద్ ప్రెస్ క్లబ్ పనితీరు ఎంతో ప్రశంసనీయమని ఉర్దూ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు ఎం.ఏ.మాజీద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జర్నలిస్టులకు వెల్ నెస్ ఆసుపత్రిలో ఉచిత హెల్త్ కార్డు సౌకర్యం కల్పించడం, అలాగే జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 75 శాతం ఫీజు రాయితీ ఇప్పించడం కోసం జిల్లా విద్యాశాఖ అధికారి ద్వారా ఉత్తర్వులు (DEO http://Proc.No. 4178/A3/2014-36, Dt: 22-09-2026) జారీ చేయించడం ప్రెస్ క్లబ్ సాధించిన గొప్ప విజయమన్నారు.

ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచారెడ్డి శ్రీకాంత్, కార్యదర్శి వాగ్మారే సుభాష్ తో పాటు ప్రెస్ క్లబ్ కార్యవర్గం జర్నలిస్టుల సంక్షేమం కోసం చేస్తున్న కృషి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన కొనియాడారు.

అదే స్ఫూర్తితో నిజామాబాద్ నగరంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కూడా ఇప్పించాలని ప్రెస్ క్లబ్ కృషి చేయాలని ఆయన కోరారు.

Post a Comment

Previous Post Next Post