బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ ఆధ్వర్యంలో పిట్లంలో విచారణ - లోధా/లోధి సామాజిక వర్గ అభ్యర్థనలు స్వీకరణ
పిట్లంలో 350 మంది వినతులు - సాయి గార్డెన్స్‌లో బీసీ కమిషన్ బృందం సమావేశం
పిట్లం, సెప్టెంబర్ 16: తెలంగాణ బీసీ కమిషన్ బృందం మంగళవారం పిట్లం మండలంలో పర్యటించి లోధా/లోధి సామాజిక వర్గానికి సంబంధించిన అంశాలపై విచారణ నిర్వహించింది.
బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తురుమలగిరి సురేందర్, డా. బాలలక్ష్మి రంగు బృందం ఉదయం 11 గంటలకు పిట్లం చేరుకుంది. బీసీ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి, బీసీ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ కూడా వారితో ఉన్నారు.
పిట్లంలోని సాయి గార్డెన్స్‌లో నిర్వహించిన విచారణ కార్యక్రమానికి సుమారు 350 మంది లోధా/లోధి సామాజిక వర్గ సభ్యులు హాజరై తమ సమస్యలు, అభ్యర్థనలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా చైర్మన్, సభ్యులు లోధా/లోధి తో పాటు ఇతర సామాజిక వర్గాల సభ్యులతో కూడా మాట్లాడి వినతులపై వివరాలు తెలుసుకున్నారు.
కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, పీఏసీఎస్ చైర్మన్, పిట్లం సర్పంచ్, బాన్సువాడ ఆర్డీవో, తహసీల్దార్, ఎంపీడీవో, బీసీ నాయకులు, డీబీసీడీవో, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.



Post a Comment