Top News

Chalo Hyderabad | ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్

బాన్సువాడలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ

ఉద్యోగుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు సాగాలి : తహసీల్దార్ నరేందర్ గౌడ్ 

బాన్సువాడ, సెప్టెంబర్ 08:

ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల జేఏసీ ఈ నెల 10వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బాన్సువాడలో అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా టీజీఈజేఏసీ నాయకులు కుషాల్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు, సభ్యులకు పిలుపునిచ్చారు.

బాన్సువాడ తహసీల్దార్ రాజ్  నరేందర్ గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కుషాల్, తహసీల్దార్ రాజ్ నరేందర్ గౌడ్, అజిమొద్దీన్, నర్వ శ్రీనివాస్, మంద ప్రవీణ్ కుమార్, దాసరి రవీందర్, భూమేష్, కలకొండ నారాయణ మరియు వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post