వేట వీరుల ఆటకట్టించిన ఫారెస్ట్ సిబ్బంది!
అడవి పందిని వేటాడిన నలుగురిపై కేసు - ఒకరు అరెస్ట్
లింగంపేట : అడవిని నమ్ముకుని వన్యప్రాణులను వేటాడుతున్న ముఠాపై అటవీ శాఖ కొరడా ఝళిపించింది.
సంఘటన వివరాలు(బొల్లారం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సయ్యద్ అషఫాక్ ప్రకారం): అయ్యపల్లి అడవిలో శనివారం బీట్ సిబ్బంది సాధారణ గస్తీ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అయ్యపల్లి తండాకు చెందిన నలుగురు యువకులు ఒక అడవి పందిని చంపి, మాంసాన్ని వాటాలు వేసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.
పోలీసులను చూసి ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారు. మూనావత్ బన్సీలాల్ అనే వ్యక్తి మాత్రం అటవీ సిబ్బందికి చిక్కాడు.
స్వాధీనం చేసుకున్నవి: వేటాడిన మాంసం, నేరానికి ఉపయోగించిన రెండు బైకులు.
అనంతరం నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం నిజామాబాద్ జైల్లో ఉన్నాడు. పారిపోయిన మూనావత్ లక్ష్మణ్, రవీందర్, పీకా కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
అడవిని, వన్యప్రాణులను ముట్టుకుంటే కఠిన శిక్ష తప్పదని బొల్లారం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సయ్యద్ అశఫాక్ హేచ్చరించారు.

إرسال تعليق