Top News

రోస్టర్ పాయింట్లలో మార్పు చేయాలి - లేకుంటే భవిష్యత్తు అంధకారమే : అయ్యాల సంతోష్

16 నోటిఫికేషన్లలో 12 చోట్ల మాలలకు జీరో పోస్టులు - ప్రభుత్వంపై మండిపడ్డ మాల సంఘం నేతలు

రోస్టర్ పాయింట్లలో మార్పు చేయాలి - లేకుంటే భవిష్యత్తు అంధకారమే : అయ్యాల సంతోష్

మద్నూర్: మద్నూర్ మండల కేంద్రంలో ఆదివారం మాల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాల సంఘం వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్ మాట్లాడుతూ.. మాలల రోస్టర్ పాయింట్ల సాధన కోసం అక్టోబర్ 4వ తేదీన హైదరాబాద్ లోని నిజాం కాలేజ్ ఠాగూర్ ఆడిటోరియంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. మాల సంఘాల నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 16 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తే, అందులో 12 నోటిఫికేషన్లలో మాలలకు ఒక్క పోస్టు కూడా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోస్టర్ కేటాయింపులో మాలలకు 12 లోపు పాయింట్ చేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, గ్రామ, మండల స్థాయిలో కమిటీలు వేసి జిల్లా వ్యాప్తంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. లేకుంటే మాల విద్యార్థులు, ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల మాల సంఘం అధ్యక్షులు ఆకాష్, నాయకులు జైపాల్, శ్రావణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم