Top News

Road Accident | బాన్సువాడలో ఆటో బోల్తా - యువతి మృతి

బాన్సువాడలో ఆటో బోల్తా - యువతి మృతి

అతివేగమే కారణం - కేసు నమోదు చేసిన పోలీసులు

బాన్సువాడ, సెప్టెంబర్ 23: ఆటో బోల్తా పడిన ఘటనలో యువతి మృతి చెందిన సంఘటన బాన్సువాడ మండలంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సింగీతం గ్రామం, మహ్మద్ నగర్ మండలానికి చెందిన కంచం ఇందు (21), భర్త అంజయ్య, కులం ముదిరాజ్, వృత్తి కూలీ పని. ఈమె బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బగవాన్ బాబాకు చెందిన AP 28 TB 4201 నంబర్ గల ఆటోలో సింగీతం నుండి బాన్సువాడ వైపు వస్తుండగా మార్గమధ్యలో కొయ్యగుట్ట వద్ద ఆటో డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో హిందూకు తీవ్ర రక్తగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

మృతురాలి తల్లి కంచం లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ తుల శ్రీధర్ తెలిపారు.



Post a Comment

أحدث أقدم