FRS System | న్యూ ఎఫ్‌ఆర్‌ఎస్‌ సిస్టంపై అవగాహన

 

న్యూ ఎఫ్‌ఆర్‌ఎస్‌ సిస్టంపై అవగాహన

జూమ్ ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలల సిబ్బందికి శిక్షణ

జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం ఆధ్వర్యంలో నిర్వహణ

బాన్సువాడ, సెప్టెంబర్ 2:

ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్ సూచనల మేరకు, కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం మార్గదర్శకత్వంలో బుధవారం జూమ్ మీటింగ్ ద్వారా న్యూ ఎఫ్‌ఆర్‌ఎస్ సిస్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా రిసోర్స్ పర్సన్స్ సయ్యద్ అబ్దుల్ రజాక్ (సీనియర్ అసిస్టెంట్), వజాహత్ అలీ (జూనియర్ లెక్చరర్) నూతన ఎఫ్‌ఆర్‌ఎస్ సిస్టం విధానం, వినియోగంపై సిబ్బందికి వివరంగా అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం పాల్గొని విలువైన మార్గదర్శకత్వం అందించారు.

Post a Comment

Previous Post Next Post