టీయూఎస్సీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా గంజి చందు నియామకం
ప్రతి ఉద్యమకారునికి న్యాయం జరిగే వరకు పోరాడుతా: చందు
బాన్సువాడ, సెప్టెంబర్ 11: తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర సహాయ కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా గంజి చందు నియమితులయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర కమిటీ అధ్యక్షులు భాషబోయిన రవీందర్ యాదవ్ బుధవారం బాన్సువాడ మండల కేంద్రంలో గంజి చందుకు నియామక పత్రాన్ని అందజేశారు.
గంజి చందు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలానికి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు.
ఈ సందర్భంగా గంజి చందు మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటు కోసం మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారునికి న్యాయం జరిగే వరకు పోరాడుతానని, ఉద్యమకారుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
మలిదశ ఉద్యమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో క్రియాశీలకంగా పనిచేసినందుకు తన సేవలను గుర్తించి కమిటీలో పదవి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు భాషబోయిన రవీందర్ యాదవ్ కు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment