ఎల్లారెడ్డిలో AGP నవీద్ పర్వేజ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ సురేష్ షెట్కర్, కాసుల బాలరాజు
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 15: ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ న్యాయవాది (AGP) మహమ్మద్ నవీద్ పర్వేజ్ తల్లి, రిటైర్డ్ ఉపాధ్యాయురాలు ఇటీవల మృతి చెందారు.
విషయం తెలుసుకున్న జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, తెలంగాణ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మంగళవారం ఎల్లారెడ్డిలోని నవీద్ పర్వేజ్ స్వగృహానికి వెళ్లి పరామర్శించారు.
మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి దుఃఖంలో తాము భాగస్వాములమని తెలిపి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కైలాష్ శ్రీనివాస్, ఎల్లారెడ్డి మాజీ జడ్పీటీసీ షేక్ గాయాజుద్దీన్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.


Post a Comment