నిజాంసాగర్ ప్రధాన కాలువకు రేపు సాగునీటి విడుదల
రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
ప్రాజెక్టు నీటిమట్టం 1401.74 అడుగులు - 13.367 టీఎంసీలు నిల్వ
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి వానాకాలం పంటల సాగునీటి అవసరాల నిమిత్తం రేపు అనగా సెప్టెంబర్ 2 మధ్యాహ్నం 1 గంటకు ప్రధాన కాలువలోకి నీటిని విడుదల చేయనున్నట్లు నీటిపారుదల శాఖ ప్రకటించింది.
నీటి విడుదల అనంతరం ప్రధాన కాలువలో ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ప్రజలకు ముఖ్య సూచనలు:
- రైతులు తమ పశువులు, గొర్రెలను కాలువలోకి దింపవద్దు
- కాలువలోకి దిగడం, ఈత కొట్టడం, దాటే ప్రయత్నం చేయరాదు
- పిల్లలను కాలువ పరిసరాలకు ఒంటరిగా వెళ్లనివ్వవద్దు
- కాలువ గట్లు, స్లూయిస్‌లు, వంతెనల వద్ద సంచరించరాదు
- ఫోటోలు, వీడియోల కోసం కాలువ దగ్గరకు వెళ్లడం ప్రమాదకరం
- వ్యవసాయ పనుల కోసం కాలువలోకి ప్రవేశించరాదు
నీటి విడుదల సమయంలో అధికారుల సూచనలు పాటిస్తూ సహకరించాలని కోరారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 1401.74 అడుగులు - 13.367 టీఎంసీలు నిల్వ
FRL 1405 అడుగులకు చేరువలో ప్రాజెక్టు - రేపు ప్రధాన కాలువకు నీటి విడుదల
ఇన్ ఫ్లో 211 క్యూసెక్కులు - గత ఏడాది ఇదే రోజు 1402.87 అడుగులు
నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం (FRL) 1405 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1401.74 అడుగులకు చేరింది.
24 గంటల గణాంకాలు (సెప్టెంబర్ 01 ఉదయం 6 గంటలకు):
నీటిమట్టం: 1401.74 అడుగులు
నిల్వ సామర్థ్యం: 13.367 టీఎంసీలు (మొత్తం సామర్థ్యం 17.802 టీఎంసీలు)
గత ఏడాది ఇదే రోజు: 1402.87 అడుగులు, 14.810 టీఎంసీలు
24 గంటల సగటు ఇన్ ఫ్లో: 211 క్యూసెక్కులు
24 గంటల సగటు అవుట్ ఫ్లో: 211 క్యూసెక్కులు (ఆవిరి రూపంలో)
స్పిల్ వే గేట్లు, జెన్కో, ప్రధాన కాలువ, ఎస్కేప్ రెగ్యులేటర్ ద్వారా విడుదల: నిల్

Post a Comment