Top News

RDO Review | బాన్సువాడలో అఖిలపక్ష సమావేశం

బాన్సువాడలో అఖిలపక్ష సమావేశం - ఎస్.ఐ.ఆర్ పై ఆర్డీవో రవీందర్ రెడ్డి సమీక్ష

ఓటర్ల జాబితా స్వచ్ఛతకు సహకరించాలని పార్టీలకు పిలుపు

బాన్సువాడ, సెప్టెంబర్ 23: బాన్సువాడ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) రవీందర్ రెడ్డి తన కార్యాలయంలో ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) - ఓటర్ల జాబితా ప్రత్యేక  సవరణపై వివిధ పార్టీల నాయకులతో చర్చించారు.

ఓటర్ల జాబితాలో నకిలీ, డూప్లికేట్, వలస వెళ్లిన, మరణించిన వారి పేర్లను తొలగించి అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఇంటింటి సర్వే ద్వారా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు ఆర్డీవో వివరించారు.

ప్రతి పార్టీ  బీఎల్ఓలకు సహకరించాలని, కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణలో భాగస్వామ్యం కావాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ఓటర్ల జాబితా స్వచ్ఛతకు అందరూ సహకరించాలని కోరారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ నేత మహ్మద్ గౌస్, బీజేపీ నాయకులు కోనాల గంగారెడ్డి, శంకర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకుడు రమేష్ యాదవ్, టీడీపీ నాయకుడు షంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

أحدث أقدم