తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని దర్శించుకున్న మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ : తిమ్మాపూర్ లో గల తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని బుధవారం ఉదయం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన వివరాలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మీడియా అకాడమీ చైర్మన్ కు వివరించారు. తిమ్మాపూర్ తిరుమల ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దేందుకు తీసుకున్న చర్యలు, భక్తుల కోసం కల్పిస్తున్న సౌకర్యాలను తెలిపారు. గతంలో తాను స్పీకర్ గా ఉన్న సమయంలో ఆలయ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తుచేశారు.
అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పోచారంలను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో TUWJ (I) - IJU, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి బైరి సుధాకర్ గౌడ్, సీనియర్ జర్నలిస్టులు సాయి గౌడ్, మొయినుద్దీన్, చంద్రశేఖర్, ఫాల్గున్, పోషీరామ్ తదితరులు పాల్గొన్నారు.







Post a Comment