AITUC Rally | ఎమ్మెల్యే పోచారంనకు ఏఐటీయూసీ వినతి

మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేల హామీ అమలు చేయాలి 

ఎమ్మెల్యే పోచారంనకు ఏఐటీయూసీ వినతి

బాన్సువాడ, అక్టోబర్ 28: తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు బుధవారం బాన్సువాడ పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా బయలుదేరి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద ధర్నా నిర్వహించి, తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. వంట కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు మాట్లాడుతూ:

- జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న జూన్, జూలై, ఆగస్టు నెలల వంట బిల్లులు వెంటనే విడుదల చేయాలి

- సెంట్రలైజ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి

- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వంట కార్మికులకు రూ.10 వేలు ఇస్తామన్న ఎన్నికల హామీని వెంటనే అమలు చేయాలి

- కోడిగుడ్లు, గ్యాస్, నిత్యావసర వస్తువులను ప్రభుత్వమే సరఫరా చేయాలి

- వంట కార్మికులకు గుర్తింపు కార్డులు, డ్రెస్ కోడ్ అమలు చేయాలి

- ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయాలి అని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మంద శంకర్, చెన్నంగారి సురేష్, కమ్మరి రాములు, కూసుకుంట్ల సాయిలు, బాల్రాజ్, ఎస్.స్వరూప, కృష్ణవేణి, సావిత్రి, నాగ గౌడ్, కిషన్, ఎండి హుస్సేన్, సువర్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

Previous Post Next Post