DCCB Ex Chairman | కృత్రిమ అవయవాల పనితీరును స్వయంగా పరిశీలించిన పోచారం భాస్కర్ రెడ్డి


మానవత్వం చాటిన పోచారం భాస్కర్ రెడ్డి - కృత్రిమ అవయవాల పనితీరును స్వయంగా పరిశీలన

వికలాంగుల ఇళ్లకు వెళ్లి పరామర్శించిన మాజీ డీసీసీబీ చైర్మన్ - అండగా ఉంటానని భరోసా

బాన్సువాడలో ముగ్గురికి కొత్త జీవితం - కృత్రిమ అవయవాలు అందించి ఆదుకున్న భాస్కర్ రెడ్డి

బాన్సువాడ, అక్టోబర్ 5: వికలాంగుల జీవితాల్లో కొత్త ఆశలు నింపే లక్ష్యంతో గత కొన్ని రోజుల క్రితం బాన్సువాడ పట్టణానికి చెందిన యాదగిరి, కరణ్, మహమ్మద్ లకు అందించిన కృత్రిమ అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి వారి ఇళ్లకు స్వయంగా వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా కృత్రిమ అవయవాల పనితీరును స్వయంగా పరిశీలించి, వాటిని వినియోగించడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో కూడా అవసరమైన సహకారం అందిస్తానని భరోసా కల్పించారు.

తమ ఇంటికి భాస్కర్ రెడ్డి రావడంతో యాదగిరి, కరణ్, మహమ్మద్ కుటుంబ సభ్యులు ఆనందంతో స్వాగతం పలికారు. తమ జీవితాల్లో మళ్లీ ఆశను నింపి, కొత్త జీవితాన్ని అందించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా సహాయక పరికరాలను పొందలేని వికలాంగ కుటుంబాలకు అండగా నిలుస్తూ, అవసరమైన కృత్రిమ అవయవాలను అందిస్తున్న భాస్కర్ రెడ్డి మానవతా దృక్పథాన్ని పలువురు అభినందించారు.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







Post a Comment

Previous Post Next Post