జూదంపై ఉక్కుపాదం మోపండి.. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేయండి: ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి జిల్లాలో క్రైమ్ రివ్యూ - లాంగ్ పెండింగ్ కేసులపై ప్రత్యేక కార్యాచరణకు ఆదేశం
దుర్గా నవరాత్రులకు పటిష్ట భద్రత - ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశం
కామారెడ్డి, అక్టోబర్ 5: నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర అధికారులను ఆదేశించారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఎస్పీ ఆదేశాల్లో ముఖ్యాంశాలు:
- లాంగ్ పెండింగ్, మిస్సింగ్ కేసులు, ఎన్‌బీడబ్ల్యూ ఎగ్జిక్యూషన్ పై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి
- గ్రేవ్ కేసుల్లో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి నిందితులకు శిక్ష పడేలా చూడాలి
- రోడ్డు ప్రమాదాల హాట్‌స్పాట్లను గుర్తించి సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి
- సైబర్, ఆర్థిక నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి
- జూదంపై ప్రత్యేక నిఘా - ఎక్కడ జూదం జరిగినా కఠిన చర్యలు తప్పవు. జూదం వల్ల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి
- మహిళల భద్రతకు షీ టీమ్స్ అప్రమత్తంగా ఉండాలి
- దుర్గా నవరాత్రుల సందర్భంగా ముందస్తు ప్రణాళికతో పటిష్ట భద్రత కల్పించాలి
- ప్రతి గ్రామంలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లలో కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసాపత్రాలతో సత్కరించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, డీఎస్పీలు మధుసూదన్, శ్రీనివాసరావు, గట్టుమల్లు, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.





Post a Comment