బాన్సువాడలో ఘనంగా వివాహ వేడుక
సయ్యద్ ఔవైస్ ఖాద్రీ వివాహ వేడుకకు ప్రముఖుల హాజరు
బాన్సువాడ టౌన్, అక్టోబర్ 10:
బాన్సువాడ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యక్తి, విద్యాశాఖ ఉద్యోగి సయ్యద్ వహాబ్ షా ఖాద్రీ, ఇస్లాంపురా వాసి తనయుడు సయ్యద్ ఔవైస్ ఖాద్రీ నిఖా వేడుక ఘనంగా జరిగింది.
జుక్కల్ నియోజకవర్గంలోని యెన్బూరా గ్రామానికి చెందిన షాకీర్ పటేల్ కుమార్తెతో నిఖా జరిగింది. అనంతరం వలీమా వేడుక బాన్సువాడలోని ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.
నూతన వధూవరులను అభినందించడానికి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంత్ రావు, బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, రూరల్ ఇన్స్పెక్టర్ తిరుపయ్యతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యుడు అలీ బిన్ అబ్దుల్లా, బాన్సువాడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మహ్మద్ ఇజాజ్, మాజీ సర్పంచ్ అలీముద్దీన్ బాబా, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు కాసుల రోహిత్, సీనియర్ కాంగ్రెస్ నేత అజీమ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, రాజకీయ, సామాజిక, మత పెద్దలు, ఉలమాలు, హఫీజ్ లు పెద్ద సంఖ్యలో హాజరై ఆశీర్వదించారు.
అతిథులను పోలీస్ శాఖ ఉద్యోగి బావమరిది నిజాముద్దీన్, వధువు చిన్నాన్న, యెన్బూరా సర్పంచ్ మొయిన్ పటేల్, లతీఫ్, తౌఫీక్ స్వాగతించారు. నిఖా సందర్భంగా ఉలమాలు, హఫీజ్ లు నాతియా కలాం పఠించి నూతన జంటను దీవించారు.









Post a Comment