Shabbir Ali | కామారెడ్డిలో మళ్లీ దసరా సందడి - లేజర్ షోతో ఘనంగా ఉత్సవాలు

కామారెడ్డిలో మళ్లీ దసరా సందడి - లేజర్ షోతో ఘనంగా ఉత్సవాలు

ఇందిరాగాంధీ స్టేడియంలో కోటి రూపాయలతో ఫ్లడ్ లైట్లకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

కామారెడ్డి, అక్టోబర్ 10:

కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ ఏడాది దసరా ఉత్సవాలను షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రకటించారు.

శనివారం స్టేడియంలో కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఫ్లడ్ లైట్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

గతంలో ఏటా దసరా ఉత్సవాలు, రావణ దహనం, లేజర్ షోలను ఘనంగా నిర్వహించేవారమని, కరోనా కారణంగా విరామం వచ్చిందని గుర్తు చేశారు. ఈ ఏడాది నుంచి తిరిగి ప్రారంభించి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చేస్తామన్నారు.

1990లో తొలిసారిగా మల్లన్నగుట్ట వద్ద రావణ దహనం, లేజర్ షోతో ఉత్సవాలు మొదలుపెట్టామని, నాలుగేళ్లు సీఎస్సీ గ్రౌండ్ లో, ఆ తర్వాత ఇందిరాగాంధీ స్టేడియం వచ్చాక 20 ఏళ్ల పాటు అక్కడే నిర్వహించామని తెలిపారు. కొన్ని రాజకీయ ఒత్తిళ్లు, అనివార్య కారణాలతో గత నాలుగేళ్లుగా నిర్వహించలేకపోయామన్నారు.

ఈ ఏడాది ఆకర్షణీయమైన లేజర్ షో, రావణ దహనంతో ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తామని, త్వరలో ప్రత్యేక ఉత్సవ కమిటీ వేస్తామని చెప్పారు. ఫ్లడ్ లైట్ల ఏర్పాటుతో క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు వస్తాయన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, మాజీ డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, కౌన్సిలర్లు అన్వర్, షేరు, సత్యం, సిద్ధిఖ్, అంజాద్, యూనుస్, చిట్టిబాబు, గంగాధర్, లోలం శ్రీనివాస్, లక్ష్మణ్, మన్సూర్, గేరిగంటి స్వప్న, పిట్ల వేణు, ఏజాజ్, గూడెం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు సందీప్, రాజగౌడ్, భూమని బాలరాజు, అనుమాల రామ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, అశోక్ రెడ్డి, పండ్ల రాజు, కన్నయ్య, నరేందర్ రెడ్డి, గొనే శ్రీనివాస్, ముబషీర్ తదితరులు పాల్గొన్నారు.










Post a Comment

Previous Post Next Post