బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు అదృశ్యం కేసులు - ఆచూకీ కోసం పోలీసుల విజ్ఞప్తి
కేసు - 1: వ్యక్తి అదృశ్యం
బాన్సువాడ, అక్టోబర్ 26: బాన్సువాడ చైతన్య కాలనీకి చెందిన జొన్నలగడ్డ ఆదాం (32), మేస్త్రీ పని, అదృశ్యమయ్యాడని బాన్సువాడ పోలీసులు తెలిపారు. ఇతని స్వస్థలం ఒంగోలు జిల్లా వాల్చర్ల.
గత 8 నెలలుగా కుటుంబంతో బాన్సువాడలో నివసిస్తున్న ఆదాం, తేదీ 24-10-2026 ఉదయం 9 గంటలకు తన బైక్ TG 07 AM 17395 పై ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. మధ్యాహ్నం 12 గంటలకు భార్యకు ఫోన్ చేసి హైదరాబాద్ లో పనికి వెళ్తున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.
గుర్తులు: ఎత్తు 5 అడుగులు, చామనచాయ, తెలుపు గీతల షర్టు, బ్లూ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు. బైక్ నంబర్ TG 07 AM 17395.
ఆచూకీ తెలిసినవారు వెంటనే బాన్సువాడ పోలీసులకు లేదా 100 కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
కేసు - 2: తల్లి, రెండేళ్ల చిన్నారి అదృశ్యం
బాన్సువాడ మండలం తాడ్కల్ గ్రామంలోని రాజారాందుబ్బకు చెందిన గడ్డం ముత్తవ్వ ఫిర్యాదు మేరకు, ఆమె కుమార్తె టేకు సుజాత (25), తన రెండేళ్ల కుమార్తె టేకు మాధవితో కలిసి తేదీ 24-10-2026 ఉదయం 8 గంటలకు తలనొప్పిగా ఉందని ఆసుపత్రికి వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు.
బంధువుల ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. సుజాత ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది.
గుర్తులు:
1. టేకు సుజాత (25): 5 అడుగులు, కోల ముఖం, తెలుపు ఛాయ, గ్రీన్ టాప్, వైట్ చున్నీ, పాయింట్ ధరించి ఉంది.
2. టేకు మాధవి (2): గుండ్రని ముఖం, చామనచాయ, పింక్ కలర్ డ్రెస్.
వీరిద్దరి ఆచూకీ తెలిసినవారు సమీప పోలీస్ స్టేషన్ లేదా బాన్సువాడ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.




Post a Comment