బాన్సువాడ పట్టణ కాంగ్రెస్ నేత గౌస్ పాషా తండ్రి మృతి - పరామర్శించిన పోచారం భాస్కర్ రెడ్డి
బాన్సువాడ: బాన్సువాడ పట్టణ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యురాలి మామ, కాంగ్రెస్ నేత గౌస్ పాషా తండ్రి పాషా బాయి అనారోగ్యంతో మరణించారు.
ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఈరోజు బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో వారి కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే టీచర్స్ కాలనీలో నివసించే గౌస్ పాషా ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు ఎజాజ్, ఖాలిద్, అలీ బిన్ అబ్దుల్లా, లింగం, రమేష్, శివ, హకీమ్, రాజు, వెంకట్, మజ్జు తదితరులు పాల్గొన్నారు.


Post a Comment