SP RAJESH CHANDRA | కామారెడ్డి ఆర్మ్డ్ రిజర్వ్ లో వార్షిక తనిఖీలు

కామారెడ్డి ఆర్మ్డ్ రిజర్వ్ లో వార్షిక తనిఖీలు 

సిబ్బంది పనితీరు అభినందనీయం: ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, అక్టోబర్ 26: కామారెడ్డి జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో వార్షిక తనిఖీలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ పరేడ్ మైదానంలో గౌరవ వందనం స్వీకరించి, సిబ్బంది కవాతును పరిశీలించారు.

అనంతరం ఆయుధాగారం, స్టోర్ రూమ్ లను తనిఖీ చేసి ఆయుధాల భద్రత, నిర్వహణ, వినియోగ విధానాలపై ఆరా తీశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ల ప్రత్యక్ష విన్యాసాలను తిలకించి, అనుమానాస్పద వస్తువులను గుర్తించడంలో వారి నైపుణ్యాన్ని అభినందించారు.

ఫైళ్లు, రికార్డుల నిర్వహణను పరిశీలించి ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ క్రమబద్ధంగా ఉంచాలని సూచించారు. రికార్డుల నిర్వహణే పోలీసు శాఖ పనితీరుకు అద్దం పడుతుందన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉండటంలో ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది పాత్ర కీలకమని, ఆపరేషన్ కవచ్ వంటి ప్రత్యేక డ్రైవ్ లు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని, శాఖ ప్రతిష్టకు భంగం కలగకుండా చూడాలని సూచించారు. ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులు ఇస్తామని ప్రకటించారు.

పరేడ్ కమాండర్ ఆర్ఐ సంతోష్, కృష్ణ, నవీన్ లను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, ఏఆర్ డీఎస్పీ ఉదయ్ భాస్కర్, ఆర్ఐలు సంతోష్ కుమార్, నవీన్ కృష్ణ, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.










Post a Comment

Previous Post Next Post