NH 44 హాట్ స్పాట్ ను పరిశీలించిన డిజిపీ
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రం లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి పర్యటిస్తున్నారు. పట్టణంలోని కళా భారతి లో మధ్యాహ్నం 2.30 గంటలకు “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ముఖ్య కార్యక్రమంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం జిల్లా కు చేరుకున్న ఆయనను ఎస్పీ రాజేష్ చంద్ర ఘన స్వాగతం పలికారు. అనంతరం సదశివనగర్ చేరుకొని అక్కడ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన హాట్ స్పాట్ ను పరిశీలించారు.
స్వాగతం పలికిన కలెక్టర్
తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర లు పూల మొక్క అందించి స్వాగతం పలికారు.
అనంతరం డీజీపీ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.



Post a Comment