ఆశయాల సాధనకు మనందరం కృషి చేయాలి: పోచారం
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ గ 135వ జయంతి సందర్భంగా బాన్సువాడలో ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు కలిసి డా. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దళిత సంఘం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జై భీమ్ నినాదాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ ‘రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ కల్పించిన రాజ్యాంగం వల్లే అణగారిన వర్గాలకు నేడు గౌరవం దక్కింది. ఆయన ఆశయాల సాధనకు మనందరం కృషి చేయాలి. సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్ చేసిన త్యాగాలు చిరస్మరణీయం’ అని కొనియాడారు.


Post a Comment