-వడగండ్లు, ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం
-రైతుల్లో ఆందోళన (వర్షం పడుతున్న వీడియో 👇)
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
కామారెడ్డి పట్టణంలో 44.3 డిగ్రీల ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వడగళ్ల వాన పడి ఉపశమనం కలిగింది. అయితే కోత దశలో ఉన్న వరి పంటకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఒక్క సారిగా మూడు గంటల ప్రాంతంలో వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది.
కామారెడ్డి పట్టణంతో పాటు శివారు గ్రామాల్లో మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. సుమారు 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా ఎండ వేడిమితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
రైతుల ఆందోళన:
గ్రామాల్లో ప్రస్తుతం వరి పంటలు కోత దశకు ఉండడంతో వడగండ్ల వర్షంతో దాన్యం నేలరాలి పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
పెరిగిన ఉష్ణోగ్రతలతో పట్టణ ప్రజలు ఎండ వేడిమికి తాళలేక ఉక్కిరిబిక్కిరి కాగా, కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడి ఉపశమనం పొందారు.

Post a Comment